29249114_1629577880472147_2929795624385642496_n

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తాం : రాహుల్‌

తిరుప‌తివెంక‌న్న సాక్షిగా ఏపికి ప్ర‌త్యేక హోదా పై మ‌రోసారి కాంగ్రెస్ అధినేత రాహుల్ హామీ ఇచ్చారు. తిరుప‌తిలో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో పోల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. తిరుప‌తి వేదిక‌గా 2014 ఎన్నిక‌ల ముందు ప్ర‌చారంలో భాగంగా నేటి ప్ర‌ధాని నాడు ఏపికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పి..మోసం చేసార‌ని విమ‌ర్శించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా అనేది దేశం ఇచ్చిన హామీ అని దానిని ఎవ‌రూ కాద‌న‌రేన్నారు. తాము కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏపార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసినా ఖ‌చ్చితంగా ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. Read more about ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తాం : రాహుల్‌

29249114_1629577880472147_2929795624385642496_n

ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ ఓ అంకెల గార‌డీ : భ‌ట్టి

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే తాత్కాలిక‌ బడ్జెట్ అని అయితే రాష్టంలో టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వ‌చ్చిన నందున‌ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే.. సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు సరై సమయంలో జరిగేదని అభిప్రాయపడ్డారు. ఏడాదిపాటు పాలన లేకుండా చేసేందుకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు. ఈ తాత్కాలిక బడ్జెట్ తో ప్రజలకు ఓరిగేదేమీ ఉండదని సీఎల్‌పీ నేత మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క అన్నారు. సీఎం కేసీఆర్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ అంకెల గార‌డీ అని ఆరోపించారు. అప్పుల‌ను కూడా ఆదాయంగా చూపించి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టారని తెలిపారు. ఇప్ప‌టికే రాప్ట్రం పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకు పోయింద‌ని, మళ్లీ అప్పులు తీసుకొచ్చి ప్రజలపై భారం మోపాలని చూస్తున్నారని ఆరోపించారు. Read more about ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ ఓ అంకెల గార‌డీ : భ‌ట్టి

29249114_1629577880472147_2929795624385642496_n

చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎమ్మెల్యే, విప్‌ చింతమనేని ప్రభాకర్‌ పై వెంటనే ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని శుక్రవారం ఏలూరులో జరిగిన మీడియా సమావేశంలో వైసిపి ఎస్‌సి సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు మెరుగు నాగార్జున డిమాండ్‌ చేశారు. దళితులను విమర్శించిన వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే కత్తుల రవి అనే వ్యక్తిని ఒక నక్సలైట్‌, ఉగ్రవాది, నెరస్తుడిలాగా ఏలూరులో అనేక స్టేషన్‌లు తిప్పుతున్నారని అన్నారు. పోలీస్‌ వ్యవస్థ సిఎం కనుసన్నలలో నడుస్తోందని, దళితులకు అండగా ఉండాల్సిన ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌లు ఏమైపోయాయని విమర్శించారు. చైర్మన్‌ కారేం శివాజీ ఒక దళిత ద్రోహి. దళితులకు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతుంటే మిన్నకుండిపోయారు. మంత్రి జాపూడి ప్రభాకర్‌ చింతమనేని ప్రభాకర్‌ వీడియోని మార్ఫింగ్‌ చేశారు అని అనడం హాస్యాస్పదమన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. Read more about చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

29249114_1629577880472147_2929795624385642496_n

గోల్కొండ టైగర్‌ బద్ధం బాల్‌రెడ్డి ఇక లేరు..!

బీజేపీ సీనియర్ నేత, మాజీ కార్వాన్ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఈనెల 10 నుంచి ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు కాగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బాల్‌రెడ్డి భౌతికకాయాన్ని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. రేపు సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో బాల్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. Read more about గోల్కొండ టైగర్‌ బద్ధం బాల్‌రెడ్డి ఇక లేరు..!

మహేశ్ ఇన్ మేడమ్ టుస్సాడ్స్..!

మహేశ్ ఇన్ మేడమ్ టుస్సాడ్స్..!

మేడమ్ టుస్సాడ్స్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది మైనపు విగ్రహాలు. అచ్చు దిద్దినట్టుగా మనిషిని పోలిన మైనపు విగ్రహాలని తీర్చిదిద్దటంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రపంచ గుర్తింపు పొందింది. జీవితాలలో అంచనాలకి మించిన ఖ్యాతి సంపాదించిన వ్యక్తుల మైనపు విగ్రహాలని వారి మ్యూజియం లో పెట్టడం ఈ సంస్థ ప్రత్యేకత.. Read more about మహేశ్ ఇన్ మేడమ్ టుస్సాడ్స్..!

29249114_1629577880472147_2929795624385642496_n

కంట్లో 500 ల కన్నాలట..!

ఇది వరకు ఫోన్ అంటే ఎవరితో అయిన మాట్లాడటానికో సమాచారాన్ని తెలియజేయటానికి వాడేవారు. ఇపూడూ ఫోన్ తోనే అన్నీ పనులు చేసేస్తున్నారు. సంచారం తెలియజేయటానికి వాడే ఫోన్ నిత్యవసర వస్తువుగా రూపు దిద్దుకుంది. ఫోన్ లేకపోతే రోజులో ఒక్క గంట కూడా గడపలేని పరిస్థితి..! చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకూ ప్రతీ ఒక్కరూ ఫోన్ వాడుతున్న కాలం ఇది. అయితే ఫోన్ వాడటం తప్పు కాదు అదే పనిగా ఫోన్ ఒక్కటే వాడటం తప్పు కొన్ని సంధార్భాల్లో ఆ తప్పే ప్రమాదాలకి దారి తీస్తుంది. Read more about కంట్లో 500 ల కన్నాలట..!

29249114_1629577880472147_2929795624385642496_n

విజయ్ మాల్యాతో జగన్ భేటీ..?

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. లండన్ కు వెళ్లిన జగన్ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాతో రహస్యంగా భేటీ అయ్యారని వెంకన్న ఆరోపించారు. ఎన్నికల కోసం హవాలా డబ్బును భారత్ కు తరలించేందుకే ఈ సమావేశం జరిగిందని విమర్శించారు. ఈ భేటీ వివరాలను జగన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడారు. అలాగే శుక్రవారం నాడు చెన్నైలోని ఓ హోటల్ లో వైసీపీ నేత సుబ్బారెడ్డి తో బీజేపీ నాయకురాలు పురందేశ్వరి, టీఆర్‌ఎస్‌ నేత సంతోష్‌, మోహన్‌బాబు రహస్యంగా భేటీ అయినట్లు ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిధుల కోసమే ఈ సమావేశం జరిగిందని బద్దా పేర్కొన్నారు. జగన్ లండన్ పర్యటనలో ఎవరెవరిని కలిశారో చెప్పాలన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరనీ, ఏపీలో మరోసారి తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. Read more about విజయ్ మాల్యాతో జగన్ భేటీ..?

29249114_1629577880472147_2929795624385642496_n

గంజాయి అంబులెన్స్ గా మారిన రోగుల అంబులెన్స్..!

గంజాయిని సేవించడమే తప్పు అంటే ఏకంగా 1813 కిలోల గంజాయి తరలించడం ఇంకెంత తప్పు..? అది కూడా ఒక అంబులెన్సు లో.. రోగులని తిప్పాల్సిన అంబులెన్స్ లో గంజాయిని తిప్పుతున్నారు. ఎవ్వరూ ఊహించని ఋతులో ఈ చర్య కి పాల్పడ్డారు స్మగ్లర్లు.. అవును ఈ ఘటన విశాఖపట్నం లో జరిగింది. Read more about గంజాయి అంబులెన్స్ గా మారిన రోగుల అంబులెన్స్..!

29249114_1629577880472147_2929795624385642496_n

పాక్ ని చిత్తుగా ఓడించండి..సచిన్

ప్రపంచ కప్ టోర్నీ చరిత్ర తీసుకుంటే పాక్ పై ప్రతిసారి భారత జట్టే పైచేయి సాధించింది. ఈ ప్రపంచ కప్ లో కూడా చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలా పాక్‌ను చిత్తుగా ఓడించే అవకాశాన్ని భారత్ వదులుకోవద్దని సచిన్ సూచించారు. పాక్ పై భారత మాజీ ఆటగాళ్లు నిరసనలు తెలియజేయాలంటూ ప్రపంచ కప్ ఆటల్లో భాగంగా జూన్ 16న జరగనున్న భారత పాక్ ఆటాను భారత జట్టు బహిష్కరించాలని కోరుతున్న విషయం తెలిసిందే. అయితే అలా చేయటం వల్ల మనమే పాక్ ను ఇంకొంచం ప్రమోట్ చేసిన వాళ్లమీ అవుతామనై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. Read more about పాక్ ని చిత్తుగా ఓడించండి..సచిన్

29249114_1629577880472147_2929795624385642496_n

ఆనాడు ఎన్టీఆర్.. ఈనాడు కే‌సీఆర్: టీడీపీ ఎమ్మెల్యే..!!

శుక్రవారం నాడు శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చలో భాగంగా టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్ తీసుకువచ్చిన పలు సంస్కరణలు రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో సహకరించాయని. అలాగే ఇప్పుడు కేసీఆర్ కూడా పలు సంస్కరణలు తీసుకొచ్చారంటూ కేసీఆర్‌ను, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుతో పొలుస్తూ వెంకటవీరయ్య ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం, పరిపాలన సంస్కరణలు, పంటలను కాపాడేందుకు విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన మార్పులు అద్భుతంగా ఉన్నాయని వెంకటవీరయ్య పేర్కొన్నారు. ముఖ్యంగా గురుకుల విద్యాలయ వ్యవస్థ విషయంలో కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని.. దీనితో పాటు అప్పుడు ఎన్టీఆర్ మండలి వ్యవస్థను తీసుకువస్తే.. ఇప్పుడు కేసీఆర్ కొత్త జిల్లాలను తీసుకు వచ్చారని చెప్పారు. అలాగే దళితులకు ప్రత్యేక యూనివర్శిటీ నెలకొల్పాలని కోరారు. ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు జరిగేందుకు చర్యలు తీసుకోవాలని… దీనికి తమ సహాయ, సహకారాలు ఉంటాయని సండ్ర చెప్పారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిపి సత్తుపల్లి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. Read more about ఆనాడు ఎన్టీఆర్.. ఈనాడు కే‌సీఆర్: టీడీపీ ఎమ్మెల్యే..!!

Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter