29249114_1629577880472147_2929795624385642496_n

శివరాత్రి విశిష్టత ఏమిటి ?

శివ అంటే మంగళమని అర్థం.పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.
శివరాత్రి అంటే ఏమిటి? ఎప్పడు వస్తుంది?
శివ అనగా మంగళకరము, శుభప్రదము. శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి. రాత్రి “చీకటి” అజ్ఞానమునకు సంకేతం కదా, మరి ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది? శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, మహేశ్వర దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగి అనగా చీకటి తొలగి జ్ఞాన వెలుగు ద్యోతకమవు తుంది. అందుకే అది శివరాత్రి, మహాశివరాత్రి. ప్రతి మాసంలోనూ అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశిని, మాస శివరాత్రి పిలుస్తారు. మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు.
మార్గశిర మాసంలో బహుళ చతుర్థి, అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈ రోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు.
శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు – “మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును. ఉపవాసము ఉండి, రాత్రి నాల్గుఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఈ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు!!”
ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగరూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. నాల్గుఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున దీక్షను తీసుకుంటారు. Read more about శివరాత్రి విశిష్టత ఏమిటి ?

Please like and share us:
దిష్టి, దృష్టి – నివారణ మార్గాలు

దిష్టి, దృష్టి – నివారణ మార్గాలు

‘నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది’ అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది. దిష్టి తీయడమనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకి తలనొప్పి రావడం, వికారపెట్టడం, వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఇక నిద్రలేవగానే గానీ, ఉదయమే బయటికి వస్తూ గాని ఎదుటివారిని చూసినప్పుడు వాళ్లు అస్వస్థతకు లోనవుతుంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు, నిద్రలేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతారు. చేతి మొదట్లో శ్రీమహావిష్ణు, మధ్యలో సరస్వతీదేవి, చివరన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. అరచేతిలో వారిని దర్శించిన తరువాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు.
దృష్టి దోషం, చెడు చూపు, దయ్యం చూపు, దిష్టికి విరుగుళ్ళు గా ఎండు మిరపకాయలు, రాళ్ల ఉప్పు, నల్ల తాడు, నిమ్మకాయల దండ, పసుపు, సున్నం కలిపిన నీళ్లు, ఇంటి గుమ్మానికి వేళ్ళాడదీసిన గుమ్మడికాయ, తలుపుపై వెలసిన దెయ్యం బొమ్మ, కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ, చంటి బిడ్డ నుదిటిపై పావలా కాసంత నల్లటి చుక్క, పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క, మెడలో తావీజు… పచ్చిమిరపకాయలు, ఈత ఆకుల చీపురు, పాత చెప్పు లాంటివి వాడుతారు.
ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే, ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను, వలయాన్ని సృష్టిస్తూ విశ్చిన్నం చేయడమన్నమాట. అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు, దిష్టి తగిలిన వాళ్లు ఇబ్బందిపడుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడొచ్చు.
హారతులివ్వడం, గుమ్మడికాయలు పగులగొట్టడం భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి. లేదా వారికి కనీసం ఏదైనా పండో, పానీయమో ఇవ్వాలి. భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వేయడం లేదా భగవంతుని తల్చుకుని కన్నులకు అద్దుకుని తినడం.. కర్పూరం బిళ్లను చుట్టూ తిప్పి దానిని వెలిగించటం నుదుటన అగరుతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతా మూర్తుల ప్రతిమలను కట్టడం కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టటం తినే ఆహార పదార్థాన్ని 7 సార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించటం ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గ, కాళి, గౌరి తదితర దేవతలను ఆరాధించడం సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కోడిగుడ్డును 7 సార్లు దిగదుడిచి 4 వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి, దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టటం లాంటివి చేస్తారు.
గృహాలు, దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలి?
దిష్టి, దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి, వ్యాపారల మీద, పంటపొలాలు, గృహాలు, కోళ్ళఫారం.. వంటి వాటిపై కూడా ఉంటాయి. అంటే సకల జీవరాశులకు, పొలాలు, వాహనాలు, గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై దిష్టి ప్రభావం ఉంటుంది. ఎలాంటి గృహమైనా, వ్యాపార సంస్థ అయినా మన్ను, ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మపండులతో దిష్టి తీయడం మంచిది.
శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితో గానీ, గోమయంతో గానీ దుకాణాలను, ఇళ్లను శుభ్రం చేయాలి. అలాగే దుకాణాలపై భాగాన కానీ, పూజాస్థలంలో గానీ గుమ్మడి పైభాగంలో కొంతభాగంగా కోసి, అందులో పసుపు, సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం మంచిది.
ఇలా టెంకాయతో గానీ, మన్ను, ఉప్పు. మిరప, ఆవాలతో దుకాణాలకు దిష్టి తీయవచ్చు. గుమ్మడి, టెంకాయలను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగులకొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయ పగుగొట్టకూడదు. అవివాహిత పురుషులు, పెళ్లై ఇంకా సంతానం కలగనివారు గుమ్మడి కాయ పగులగొట్టరాదు.
ఇంకా చెప్పాలంటే.. ప్రతిరోజూ సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్ళు చల్లి, ఎండాకా లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్ర శనివారాలు దీపాలు పెట్టాకా, ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపారవృద్ధి కలుగుతుంది.
బాల గ్రహ దోషముల నివారణకు..
పిల్లలకు దిష్టి తీసే సమయంలో, పళ్లెంలో నీళ్లు పోసి, అందులో కుంకుమ వేసి, మరొక పళ్లెం తీసుకుని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నము ముద్దలు కలిపి అందులో వేసి, దిష్టి తీసి, ఇంటికి దూరంగా బయట మూడు దారులలో పోయాలి. ఇలా చేస్తే బాల గ్రహ దోషములు పోవును. Read more about దిష్టి, దృష్టి – నివారణ మార్గాలు

Please like and share us:
రుణాల బాధ తొలగిపోవాడనికి చిన్న సాధన

రుణాల బాధ తొలగిపోవాడనికి చిన్న సాధన

స్వగృహంలో వివిధ రకాల వత్తులతో దీపారాధన చేస్తుంటారు. అయితే ఈ దీపారాధనకు ఉపయోగించే వత్తులు సాధారణంగా పత్తితో తయారు చేసినవై ఉంటాయి. వివిధ రకాల వత్తులతో ఈ దీపారాధన చేయవచ్చు. ఏ రకమైన వత్తులతో దీపారాధన చేస్తే ఫలితాలు కలుగుతాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలిద్ధాం. అరటి నారతో దీపారాధన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగ గలదు, అరటి నారతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుందని . జిల్లేడు నార వత్తులతో దీపారాధన చేయడం వల్ల శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుందని, పసుపురంగు వస్త్రంతో దీపారాధన చేయడం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని పత్తితో చేసిన దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. అలాగే, తామర తూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు.. రుణాల బాధ తొలగిపోతుందాని నమ్మకం. వత్తులను పన్నీరులో అద్ది నేతితో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహం కలుగుతుందని అదేవిధంగా కుంకుమ నీటితో, దానిలో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోవడమే కాకుండా, ఇంటిపై ఎలాంటి మాంత్రికశక్తులు పని చేయవని కొన్ని రహస్య గ్రంధాల సమాచారం.దీనితో పాటు ధనసంపదనిచ్చే మంత్రాన్ని జపించుట మరింత శుభము.
మంత్రం
కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవం
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః
నిష్టగా రోజుకు 108 పర్యాయాల చొప్పున కనీసం 21రోజులు జపించిన శుభఫలములు కలుగుతుంది. Read more about రుణాల బాధ తొలగిపోవాడనికి చిన్న సాధన

Please like and share us:
పౌర్ణమి గరుడసేవ నేడు

పౌర్ణమి గరుడసేవ నేడు

తిరుమలలో ఫిబ్ర‌వ‌రి నేడు మంగ‌ళ‌వారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది.ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. Read more about పౌర్ణమి గరుడసేవ నేడు

Please like and share us:
దేవాలయమంటె ఏమిటి? ఈ దేవలయాలు ఎందుకు?

దేవాలయమంటె ఏమిటి? ఈ దేవలయాలు ఎందుకు?

‘దేవానాం దేవస్య వా ఆలయా అని సమధానమిచ్చారు మన ఋషిపుంగవులు. దేవాలయం ప్రార్థన కోసం, పూజ కోసం, దేవతావిగ్రహాలను, ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్టించి, వాటి రక్షణకోసం కట్టించిన కట్టడమే దేవాలయమని అన్నారు. అంద..
అందరూ వెళ్లగలరా..? అవకాశాలు లభిస్తున్నాయ..?

అందరూ వెళ్లగలరా..? అవకాశాలు లభిస్తున్నాయ..?

టెక్నాల‌జీ పెరిగిపోతున్న ఈ కాలంలో మ‌న దేశ యువ‌త దూసుకుపోతోంది. అన్ని దేశాల్లోనూ, అన్ని రంగాల్లోనూ మ‌న యువ‌త ముందుంటున్నారు. మ‌న వారికి విదేశాల్లో మంచి డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో విదేశాలకు వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్కరులోను పెరుగుతోంది. దీనికి తగ్గట్టే ఉపాదికి తగ్గ విద్యను ఇక్కడే ఆర్జిస్తున్నారు. ఉద్యోగం కాకపోయిన విద్య కోసమైన విదేశాలకు వెళ్ళాలని ఆశించేవారు చాలా మంది ఉన్నారు. అయితే అందరు వెళ్ళగలుగుతున్నారా, అందరికి అలాంటి అవకాశాలు లభిస్తున్నాయా లేదా అనేది వారి వారి జాతకాలను బట్టి ఉంటుంది. ఏయే గ్రహాలు జాత‌కుడిని విదేశీయానం వైపుకి తీసుకుపోతాయో పరిశీలిద్దాం. Read more about అందరూ వెళ్లగలరా..? అవకాశాలు లభిస్తున్నాయ..?

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

విదేశీయానం.. ఎవ‌రికి.. ఎప్పుడు ఎలా?

టెక్నాల‌జీ పెరిగిపోతున్న ఈ కాలంలో మ‌న దేశ యువ‌త దూసుకుపోతోంది. అన్ని దేశాల్లోనూ, అన్ని రంగాల్లోనూ మ‌న యువ‌త ముందుంటున్నారు. మ‌న వారికి విదేశాల్లో మంచి డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో విదేశాలకు వెళ్ళాల..
29249114_1629577880472147_2929795624385642496_n

గర్భవతులు: వాస్తు, పూజలు, వ్రతాలు

మహిళలకు భక్తిభావం అధికంగా ఉంటుంది. పూజలు, వ్రతాలు చేయడంలో శ్రద్ధ చూపిస్తారు. నిత్యం పూజ కోసం పూలు కోసి, మాలగా కట్టి భగవంతునికి సమర్పించడంలో సంతోషాన్ని, సంతృప్తిని పొంతుతారు. పూజలు, వ్రతాలు, అభిషేకాలంట..
కలలు వాటి ఫ‌లితాలు

కలలు – వాటి ఫ‌లితాలు

నిద్ర‌లో క‌లలు క‌న‌డం మాన‌వ స‌హ‌జం. కేవలం మ‌నుషులే మాత్రమే కాదు… ప్రతి పక్షి, ప్రతి జంతువూ, ప్రతి ప్రాణి కలలు గనడం అతిసాధార‌ణ‌మే. సింహ స్వప్నం అనే మాట ఆలా పుట్టినదే. ఏనుగు…
బ్రహ్మముహూర్తం..పురాణగాథ..ఏం చేయాలి..?

బ్రహ్మముహూర్తం..పురాణగాథ..ఏం చేయాలి..?

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.
నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.
పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.
ఏం చేయాలి..?
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.
ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు… హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.
చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది. బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.
బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము. Read more about బ్రహ్మముహూర్తం..పురాణగాథ..ఏం చేయాలి..?

Please like and share us:
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter