29249114_1629577880472147_2929795624385642496_n

115 మందితో టీడీపీ తొలి జాబితా విడుదల

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. దీంతో ఇప్పటికే పలు జిల్లాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధిపతి, ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా మరికొన్ని జిల్లాలకు అభ్యర్థులను ఫిక్స్ చేశారు. ఇప్పటివరకు మొత్తం 115 మంది అభ్యర్థుల్ని టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇంకా 60 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా.. సోమవారం సాయంత్రానికల్లా మరో 30 మంది అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. Read more about 115 మందితో టీడీపీ తొలి జాబితా విడుదల

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌

కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. న‌ల్గొండ జిల్లా నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిన్న‌నే (శ‌నివారం) టీఆర్ ఎస్ లో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించి కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌ తెరాసలో చేరనున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెరాస బీ ఫామ్‌పై పోటీకి తాను సిద్ధమని హరిప్రియ ప్రకటించారు. ఇల్లెందు అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ బాటలో పయనించాలని నిర్ణయించుకున్నానని.. ఆయన సారథ్యంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో తాను కూడా భాగస్వామ్యం అవుతానని ఆమె చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకే చెందిన నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా తెరాసలో చేరనున్నట్లు శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గంతో పాటు నల్గొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని లింగయ్య చెప్పారు. Read more about కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్డ్ వివరాలు :

17 వ పార్లమెంట్ లో 543 పార్లమెంటు ఎన్నికల తో పాటు నాలుగు రాష్ట్ర ల అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్డ్ వివరాలు తెలిపిన కేంద్ర ఎన్నికల చీఫ్ కమీషనర్ సునీల్ అరోరా ఆదివారం మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ..సార్వత్రిక ఎన్నికలు కు ఎలక్షన్ కమీషన్ సమగ్ర ఎర్పాటులు చేసిందన్నారు. అన్ని రాష్ట్రాలలో పర్యటించి ఎర్పాటులు ను పరిశీలించామ‌న్నారు. అన్ని రాష్ట్రాల చీప్ ఎలక్షన్ కమీషనర్ లతో మాట్లాడి పరీక్షలు ,పండుగలు కి సంబంధించిన తేదిలను పరిగణనలోకి తీసుకుని ఈ షెడ్యూల్డ్ రూపొందించటం జరిగింద‌ని తెలిపారు.
జున్ మూడు తో ప్రస్తుత లోక్ సభ కాలపరిమితి ముగుయ‌నున్ననేప‌థ్యంలో స్వేచ్ఛాయుత వాతావరణం లో ఎన్నికలు జరిగేలా ఇప్పటికే ఎర్పాట్లు చేసినట్టు వివ‌రించారు. నేటి నుండే దేశంలో ఎన్నికల కోడ్ అమలు లో ఉంటుంది. 2014 తరువాత 8.4 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదు అయినాయ‌న్నారు. 18 -19 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్లు 1.5కోట్లు ఉన్నారు. 99.36 శాతం మందికి ఓటర్ కార్డ్ లు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓటరు కార్డులు పంపిణీ నూటికి నూరు శాతం పూర్తి చేశాం. దేశ వ్యాప్తంగా గా 90 కోట్లు మంది ఓటర్లు ఉన్నాట్టు ఆయ‌న తెలిపారు. 1950 నెంబర్ ద్వారా ఓటును చెక్ చేసుకోవచ్చు, దేశం లో సుమారు 10లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయ‌న్నారు. అన్ని చోట్ల ఈవియం ల‌ తో పాటు వి వి ప్యాట్ లను ఉపయోగిస్తామ‌న్నారు. ఓటర్ కార్డు తో పాటు పదకొండు రకాల ఐ డి కార్డులు అనుమతి వుంటుంద‌ని, ఫోటో ఓటర్ స్లిప్ ను ఐ డి కార్డు గా పరిగణించమ‌ని తెలిపారు. ఓటర్లు జాబితా ప్రకటించాక మార్పులు ఉండవన్నారు. పోలింగ్ కు ఐదు రోజుల ముందు నుండి ఓటర్ స్లీప్ ల పంపిణీ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. సున్నితమైన ప్రాంతాలలో ఎన్నికలు కు ప్రత్యేక అబ్జర్వర్ లు ఉంటార‌న్నారు. రాత్రి పది నుండి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్ లో కు అనుమతి లేదు. కోడ్ ఉంలంగన పై ప్రజలే నేరుగా ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేయ్యవచ్చు. ఫిర్యాదు కోసం ప్రత్యేక యాప్ ను తాయరు చేసిన ఎన్నికల కమీషన్. అభ్యర్థులు సోషల్ మీడియా ఎకౌంటు లకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుంది. సోషల్‌ మీడియా కూడా ఎలక్షన్ కమీషన్ పర్యవేక్షణ లొ ఉంటుందని, సోషల్ మీడియా లో తప్పడు ప్రచారం చెయ్యారాదన్నారు. Read more about 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్డ్ వివరాలు :

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

ఎన్నిక‌ల న‌గారా మోగింది.

దేశ‌వ్యాప్తంగా జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదివారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ఎన్నిక‌ల్లో తొటివిడ‌తలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పాటు తెలంగాణ‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 11న తెలుగు రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు, తెలంగాణలోని 17లోక్‌సభ స్థానాలకూ ఏప్రిల్‌ 11నే ఎన్నికలు జరగనున్నాయి. 2014లో తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగ్గా, ఈసారి తెలంగాణ తెరాస ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. Read more about ఎన్నిక‌ల న‌గారా మోగింది.

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

తిరుమ‌ల స‌మాచారం

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో ఈ రోజు ఆదివారం 10.03.2019 ఉదయం 5 గంటల సమయానికి, భక్తుల రద్దీ నెలకొంది. ప్రస్తుతం కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్లు బయటకు వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం సమయం పడుతోంది. కాగా… టైంస్లాట్‌, నడక దారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు మూడు గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక దర్శనానికి కూడా మూడు గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. Read more about తిరుమ‌ల స‌మాచారం

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

కెసిఆర్‌ ఆలోచనలే దేశానికి మార్గ ద‌ర‌శకంగా మారాయి

రాష్ట్రాంలోనే మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాని అత్యధికంగా మూడు జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల్‌ జిల్లాలను కొత్త‌గా ఏర్పాటు చేసుకున్నామని కెటిఆర్‌ పేర్కొన్నారు. నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలోముఖ్యఅతిథిగా టిఆర్‌స్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా కెటిఆర్‌ ప్రసంగించారు. సిఎం కెసిఆర్‌ స్వయంగా రైతు అయినందువల్లే రైతు సంక్షేమ పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇవాళ మన రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టారు. మన రైతుబంధు పథకాన్ని పేరు మార్చి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. కెసిఆర్‌ ఆలోచనలనే నేడు చాలామంది ముఖ్యమంత్రులు అనుసరిస్తున్నారు. 43 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం ఇది. ఏప్రిల్‌ నుంచి ఆసరా పెన్షన్లు రూ.2016 ఇస్తామన్నారు. ఢిల్లీ గద్దెను ఎక్కేది ఎవ‌రో టీఆర్‌ఎస్‌ నిర్ణయించాలని కెటిఆర్‌ వివరించారు. అంతేకాక పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ స‌మావేశంలో మంత్రులు నిరంజ‌న్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు. Read more about కెసిఆర్‌ ఆలోచనలే దేశానికి మార్గ ద‌ర‌శకంగా మారాయి

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

మా నాయ‌కున్ని విమ‌ర్శిస్తే ఊరుకునేది లేదు.

నిరంత‌రం పేద‌ల అభివృధ్దికి పాటు ప‌డే నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడ‌ని అలాంటిది మా నాయ‌కుడిని విమ‌ర్శిస్తే ఊరుకునేది లేద‌ని తెలంగాణ రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌ను హెచ్చ‌రించారు ఆయ‌న వియ్యంకుడు టీటీడీ చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్. ఇక‘‘చంద్రబాబు రాజకీయ భిక్షతోనే ఈ రోజు నీవు ఈ స్థాయికి ఎదిగావు. దానిని మరిచిపోయి ఆయన్నే విమర్శించడం తగదు’’ అంటూ తలసానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కడప జిల్లా మైదుకూరులో విలేకరుల సమావేశంలో సుధాక‌ర్‌ మాట్లాడారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజన తర్వాత కూడా బీసీలు ఈ స్థాయికి ఎదిగారంటే అది కేవలం చంద్రబాబు వల్లే. నీతో పాటు మంత్రి యనమల, నేను ఈ స్థాయిలో ఉన్నామంటే చంద్రబాబే కారణమని మరిచిపోవద్దు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎప్పుడూ లేని విధంగా టీటీడీ చైర్మన్‌గా నన్ను నియమించారనే విషయం గుర్తు పెట్టుకోవాలి. బీసీల్లోని వివిధ వర్గాలకు కూడా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించిన ఘనత చంద్రబాబుదే. మా రాష్ట్రం బీసీలకు అన్యాయం చేసిందంటూ మాట్లాడటం నీకు తగదు. నాకు వియ్యంకుడివే కావచ్చు. కానీ మా ముఖ్యమంత్రిని విమర్శిస్తే సహించేదీ లేదు’’ అని స్పష్టం చేశారు. Read more about మా నాయ‌కున్ని విమ‌ర్శిస్తే ఊరుకునేది లేదు.

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి గ‌ట్టి షాక్‌ తగిలింది.న‌ల్ల‌గొండ జిల్లాలో కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌కి ఎదురే లేదు. కాని ఇప్ప‌డు అక్క‌డ వారికి ఎదురు దెబ్బలు త‌గులుతున్నాయి. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి ఓట‌మి చ‌విచూశారు. ఈజాగా వారికి న‌మ్మిన బంటు అయిన నకిరేకల్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య త్వరలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేస్తానని చిరుమర్తి లింగయ్య అన్నారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు వ్యతిరేకించారని.. అయినా నేతల తీరులో మార్పు రాలేదని చిరుమర్తి లింగయ్య విమర్శించారు. లింగయ్య 2009లో, 2018లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కోమటిరెడ్డి సోదరులకు ఆయన సన్నిహితుడు. ఎన్నికలకు ముందు ఆయనకు టికెట్‌పై ఊగిసలాట ఉండగా కోమటిరెడ్డి సోదరులు పట్టుబట్టి టికెట్‌ ఇప్పించారు. లింగయ్య పార్టీ మారుతారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈనెల 12న జరగనున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తెరాస పార్టీ కాంగ్రెస్‌ సభ్యుల మద్దతు సమీకరించే సన్నాహాల్లో ఉంది. మంత్రి జగదీశ్‌రెడ్డి, కొందరు శాసనసభ్యులు లింగయ్యతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇవి ఫలించడంతో ఆయన శుక్రవారం నేరుగా సీఎం వద్దకు వెళ్లి కలిసి మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. మండలి ఎన్నికల కోసం ఈనెల 10న తెరాస ఎమ్మెల్యేలతో పార్టీ అధిష్ఠానం సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశానికి సండ్ర, కాంతారావు, సక్కులతో పాటు లింగయ్యలను తెరాస ఆహ్వానించినట్లు సమాచారం. Read more about కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

కేసీఆర్‌‌కు నేనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించి.. ఆ ఓటమిని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌‌కు రిటర్న్‌ గిఫ్ట్‌గా పంపుతానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం రాత్రి పాణ్యం ఎమ్మెల్యే గౌరు దంపతులు టీడీపీలో చేరిన అనంతరం ఆయ‌న మాట్లాడుతూ…తెలంగాణ సీఎం.. గులాబీ బాస్‌, వైసీపీ అధినేత జగన్‌పై ఆగ్ర‌హం వ‌క్తం చేశారు.రాష్ట్ర అభివృద్ధి కోసమే గౌరు దంపతులు టీడీపీలో చేరారని బాబు చెప్పారు. హైదరాబాద్‌లో కూర్చోని జగన్ ఏపీ రాజకీయాలు చేస్తారా..? రాజకీయం చేస్తే ఇక్కడే చేయాలని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పంచన చేరి మనపై వైసీపీ అధినేత కక్ష సాధిస్తున్నారన్నారు. “పోలవరం ప్రాజెక్ట్ మేం కడితే నీకేంటి బాధ. గోదావరి నీళ్లు పెన్నాకు తీస్తే వీళ్లకేంటి ఇబ్బంది..?. మీరు కాళేశ్వరం కడితే నేనేమన్నా బాధపడ్డానా..?. ప్రధాని మోదీకి ఊడిగం చేయడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు ఒక్క కేసు పెడితే.. నేను పది కేసులు పెడతాను” అని కేసీఆర్‌కు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. Read more about కేసీఆర్‌‌కు నేనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

రేపు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు (ఆదివారం,మార్చి-10) పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలోపు వయస్సున్న దాదాపు 35,12,333 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఆయా విభాగాలకు అవగాహన కల్పించి, 52,19,180 వ్యాక్సినేషన్ డోస్‌లు రెడీ చేసింది. మహిళా శిశు సంక్షేమశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీ రాజ్, ఐకేపీ, డిఫెన్స్, నేవీ, ఆర్టీసీ శాఖల సమన్వయంతో పోలియోచుక్కల కార్యక్రమం నిర్వహించనున్నారు. పల్స్‌పోలియో కార్యక్రమంలో 95,513 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు వైద్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆదివారం చేపట్టనున్న కార్యక్రమంలో పల్స్‌పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు, ఆ తర్వాత రెండు రోజులపాటు ఇంటింటికీ వెళ్లి వేసేందుకు వైద్యశాఖ ప్రణాళిక రూపొందించింది. ప్రయాణాల్లో ఉన్నవారి కోసం 787 మొబైల్ టీమ్స్ ద్వారా అన్నిబస్టాండ్లలో, రైల్వేస్టేషన్లలో, ప్రధాన కూడళ్లలో చుక్కల మందు వేయనున్నారు. ఏటా రెండుసార్లు పోలియో చుక్కలు వేస్తుండగా.. ఈ ఏడాది ఒకేమారు వేయనున్నారు. దేశంలో గత 8ఏళ్లుగా ఎక్కడా పోలియో కేసులు నమోదు కాకపోయినా.. మన రాష్ట్రంలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. Read more about రేపు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో

Please like and share us:
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter