శ్రీరామనవమి టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయం :

ఏప్రిల్‌ 14న భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే స్వామి వారి తిరు కల్యాణం, 15న జరిగే శ్రీరామ మహాపట్టాభిషేకానికి సంబంధించిన టికెట్లను నేటి నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు దేవస్థానం ఈవో టి. రమేష్‌బాబు తెలిపారు. కల్యాణం రోజున వీక్షించే భక్తుల సౌకర్యార్దం రూ.5 వేలు, రూ.2 వేలు, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి. అలాగే పట్టాభిషేకం రోజుకు సంబంధించి రూ.250, రూ.100 టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల భక్తులు భద్రాచలం ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా రూ.5 వేల శ్రీరామనవమి కల్యాణం ఉభయదాతల టికెట్లు దేవస్థానం కార్యాలయంలో విక్రయిస్తున్నారని ఆసక్తి గల భక్తులు దేవస్థానం పనివేళలల్లో సంప్రదించాలని కోరారు. వివరాలకు 08743- 232428లో సంప్రదించాలని కోరారు.

Go To APTS Breaking News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *