వైసీపీ లోకి.. ఓ పెద్ద వ్యాపార వేత్త..!

సాదారణ దళిత కుటుంబం లో పుట్టి అక్కడ నుంచి అంచలంచాలుగా ఎదిగి ప్రస్తుతం భారీ స్థాయి పారిశ్రామిక వేత్తగా ఎదిగారు మన్నెం మధుసూదన రావు. ఈయనకి ఎం‌ఎం‌ఆర్ అనే గుర్తింపు ఉంది. ఇప్పుడు మన్నెం ఎంఎంఆర్ గ్రూపు సంస్థలకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఎం‌ఎం‌ఆర్ తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది దళితులకి సేవ సహకారాలు అందించారు. సేవా దృక్పదం ఉన్న ఈయన ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేయాలని భావించాడు.

ఈ సంధర్భంగా నేడు ఆయన వైసీపీ అధినేత జగన్ సమక్షం లో వైసీపీ లో చేరారు. పార్టీ లోకి వచ్చిన ఆయనని జగన్ సాదరంగా ఆహ్వానించారు. పార్టీ లో చీరిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ దళితులకై ఎన్నో సంక్షేమ కార్యక్రామాలు చేశాను.. ఇప్పుడు అన్నీ వర్గాల ప్రజలకి సేవ చేయాడానికి రాజకీయంలోకి వచ్చాను. అన్నీ వర్గాల అభివృద్ది జగన్ తోనే సాధ్యం..! వైసీపీనీ గెలిపించి జగన్ ని సీఏం చేయడమే నా ముఖ్య లక్ష్యం.. పార్టీ ఎటువంటి బాద్యత అప్పగించినా విస్తృతంగా చిత్తశుద్ధితో ఆచరిస్తా.. అని ఆయన అన్నారు.

The post వైసీపీ లోకి.. ఓ పెద్ద వ్యాపార వేత్త..! appeared first on MahaaNews.

Go to Mahaa News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *