మూడో వ‌న్డేలో భార‌త్ ఓట‌మి :

ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన మూడో వన్డేలో భారత్ పోరాడి ఓడింది. 314 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో కెప్టెన్ కోహ్లీ మరోమారు ఆపద్బాంధవుడయ్యాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసి జట్టును ఓ గాడిలో పెట్టినప్పటికీ సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో అతడి సెంచరీ వృథా అయింది. చివర్లో కేదార్ జాదవ్ (26) విజయ్ శంకర్ (32), రవీంద్ర జడేజా (24) మెరుపులు మెరిపించినప్పటికీ భార‌త్‌ని విజ‌య తీరాల‌కు చేర్చ‌లేక పోయారు. మరో పది బంతులు మిగిలి ఉండగానే 281 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. ఈ విజయంతో ఖాతా తెరిచిన ఆసీస్ 5 వన్డేల సిరీస్‌లో 2-1తో భారత్ ఆధిక్యాన్ని తగ్గించింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ చెలరేగిపోయింది. ఓపెనర్లు అరోన్ ఫించ్ (93), ఉస్మాన్ ఖావాజా (104)తో చెలరేగిపోయారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్ద‌రూ భారత బౌలింగ్ ను ఓ ఆటాడుకున్నారు. అయితే, ఆ తర్వాత అడపాదడపా వికెట్లు పడినప్పటికీ ఆసీస్ జోరు మాత్రం కొనసాగింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (47), మార్కస్ స్టోయిన్స్ (31 నాటౌట్) కూడా త‌లో చెయ్యి వేయ‌డంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసుకోగా, షమీ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, నాలుగో వన్డే ఈ నెల 10న మొహాలీలో జరగనుంది.

Go To APTS Breaking News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *