దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది!

వరంగల్‌పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బిజెపికి 150సీట్లు కూడా వచ్చేది కష్టమే, కాంగ్రెస్‌ పార్టీకి 100 సీట్లు రావ‌డం కూడా కష్టమేన‌న్నారు. మొత్తంగా దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందనిఆయ‌న అన్నారు. గ‌త ఐదేళ్ళ కాలంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడి ప్రభుత్వం పనితీరు దేశ ప్రజలకు అర్థమైపోయింద‌ని, రోజురోజుకూ మోదీ గ్రాఫ్ పడిపోతోందని ఆరోపించారు. ఇటీవ‌ల ప‌లు రాష్ట్రాల ఎన్నిల‌క్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలు కావ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం అన్నారు. ఇక‌ కాంగ్రెస్ మీద ప్రజలకు ప్రేమ లేదు. ఆయా రాష్ట్రాల‌లో దిక్కులేక కాంగ్రెస్ ను డెలిపించారని ఆరోపించారు.. 2014లో ఉన్న పరిస్థితులు ఈరోజు కేంద్రంలో లేవు అన్నారు.రేపు దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. అందుకే మనం 16 మంది ఎంపీలను గెలిపిస్తే ముక్కు పిండి నిధులు తెచ్చుకోవచ్చు. మేమే గెలుస్తామని కాంగ్రెసోళ్లు అంటున్నారు. వాళ్ల పరిధి, పాత్ర ఏందో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చూపించారు. ఒకట్రెండు స్థానాల్లో కాంగ్రెసోళ్లు గెలిస్తే వాళ్ల బతుకు మొత్తం ఢిల్లీనే. రాహుల్ గాంధీ చెప్పినట్లు వింటారు. అందుకే 16 మందిని గెలిపిస్తే నిధులు వరదలా వస్తాయని కేటీఆర్ తెలిపారు.

Go To APTS Breaking News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *