తిరుమల |/ సమాచారం

ఓం నమో వేంకటేశాయ!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ఈ రోజు శుక్రవారం 08.03.2019 ఉదయం 5 గంటల సమయానికి స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 05 గదుల్లో భక్తులు స్వామి దర్శనం కోసం వేచియున్నారు,
ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటలు పడుతుంది. శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం, (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం
పడుతుంది.

వయోవృద్దులు మరియు దివ్యాంగులకు ప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ: 10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు,

నిన్న 57,091 మంది భక్తులకి, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కలిగినది,

నిన్న 13,795 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

అలాగే నిన్న స్వామివారికి హుండీలో భక్తులు నగదు రూ. 2.74 కోట్లు సమర్పించారు.

వాతావ‌ర‌ణం తిరుమల: అత్య‌ల్పంగా 21C° న‌మోద‌కు కాగా అత్య‌ధికంగా 32C° న‌మోదుకానుందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

Go To APTS Breaking News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *