ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయం సీజ్‌

తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన డేటా వివాదం కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ కొనసాగుతోంది. స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. అందులో ఉన్న హార్డ్ డిస్క్లను పోలీసులు ఇదివరకే స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన కంప్యూటర్లను సైతం స్వాధీనం చేసుకున్నాక శుక్రవారం ఆ కార్యాలయాన్ని సీజ్ చేశారు. కార్యాలయం వద్దకు ఇతరులెవరూ రాకుండా పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. హార్డ్ డిస్క్ ల‌ డేటాను ఐటీ నిపుణుల సాయంతో విశ్లేషిస్తున్నారు. పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థ సీఈవో అశోక్ ను అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు సిట్ అధికారి స్టీఫన్ రవీంద్రకు మరోసారి వివరించారు. అమెజాన్ నుంచి సమాచారం వచ్చిన తర్వాత.. ఆ డేటాను మరోసారి విశ్లేషించనున్నారు.

Go To APTS Breaking News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *