ఏపీలో ప్ర‌జాద‌ర‌ణ‌ను చూసి ఓర్వ‌లేక కుట్ర‌లు : ఎల్ ర‌మ‌ణ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగు దేశం పార్టీకి వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణ‌ను చూసి ఓర్వ‌లేక ప్ర‌ధాని న‌రేంద్ర మోడి, కేసీఆర్, వైయ‌స్ జ‌గ‌న్‌లు క‌లిసి కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని తెలంగాణ తెలుగు దేశం అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ ఆరోపించారు. ఈ రోజు ఎన్‌టీఆర్ ట్ర‌స్టు భ‌వన్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఏపీలో అములు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు ప్ర‌జ‌ల్లో విశేష స్పంద‌న వ‌స్తుంద‌ని, ప్ర‌జ‌లు సీయం చంద్ర‌బాబుకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీని ప్ర‌జ‌లు అఖండ మెజార్టీతో గెలిపించబోతున్నార‌ని ఆయ‌న అన్నారు. దీనిని జీర్ణించుకోలేని ఈ ముగ్గురు మోడీలు క‌లిసి ఐటీ గ్రిడ్ అనే కుట్ర‌కు తెర లేపార‌న్నారు. ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు వీరంతా ఓ నాట‌కం ఆడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కేంద్రంలో ఓ మోడి, తెలంగాణ‌లో మ‌రో మోడి ఈ ఇద్దరు మోడీలు త‌మ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏపీలో జ‌గ‌న్ అనే మ‌రో మోడీని అధికారంలోకి తేవ‌డానికి ప‌న్నాగం ప‌న్నుతున్నార‌ని అన్నారు. వీరు ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా ఏపీలో రాబోయేది టీడీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రం దేశం లోనే ధ‌నిక రాష్ట్రంగా ఉంద‌ని, అలాంటి ధ‌నిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేత‌గాని త‌నంతో అప్పుల ఊబీలోకి నెట్టార‌ని విమ‌ర్శించారు. ఏపీలో లోటు బ‌డ్జ‌ట్‌తో చంద్ర‌బాబు ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న అందిస్తున్నాడ‌ని తెలిపారు. అప్పుల పాలు చేసి అభివృధ్ధి అన‌డం కాదు, రాష్ట్రాన్ని మిగులు బ‌డ్జ‌ట్‌లో దేశంలోనే ధ‌నిక రాష్ట్రంగా ముందుకు తీసుకువెళ్ళి, ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న అందించిన‌ప్పుడే అభివృద్ది అంటార‌ని హిత‌వు ప‌లికారు.
సమేవేశంలో రావుల చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. గ‌త ఎన్నికల్లో తెలంగాణ‌లో మిష‌న్ 100 నేరుతో టీఆర్ఎస్ పార్టీ అధికార యాప్ తో ఆపార్టీ కేంద్ర కార్యాల‌యం కేంద్రంగా 60 ల‌క్ష‌ల ఓట‌ర్ల‌తో నేరుగా ఫోన్‌లు చేసి మాట్లాడింది నిజం కాదా అని ప్ర‌శ్నించారు. ప్ర‌తి పార్టీకి ఓ యాప్ వుంది. అందులో ఆ పార్టీ కార్య‌క‌ర్తాల వివ‌రాలు ఉంటాయ‌ని వివ‌రించారు. అలాగే టీడీపీకి సేవా మిత్ర అనే యాప్ వుంది. అందులో మా పార్టీ కార్య‌క‌ర్త‌ల వివ‌రాలు ఉన్నాయి. అందులో సీక్రేట్ ఏముంద‌ని ప్ర‌శ్నంచారు. ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఏపీలోని ఓటర్ల‌ను ఎలా తొల‌గిస్తారో అది తెల‌సుకుని మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు. ఓట‌రు లిస్టు నుండి ఒక పేరు తొల‌గించాలంటే అది కేవ‌లం ఫాం 7 ద్వారా ఎన్నిక‌ల నిర్వాహానా అధికారులకు మాత్ర‌మే తొల‌గించే అధికారం వుంటుంద‌ని తెలిపారు. వైసీపీ నాయ‌కుడు విజ‌య‌సాయి రెడ్డి గ‌త నెల 23న విశాఖ‌లో మాట్లాడిన ఆయ‌న ఏపీకి సంబంధించిన విష‌యాన్ని ఏపీ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌క… తాజాగా మార్చి 2న లోకేశ్వ‌ర్ రె్డ్డితో హైద‌రాబాద్ లో ఫిర్యాదు చేయించి ఇక్క‌డి కేసీఆర్ ప్ర‌భుత్వం త‌న అధికారాన్ని వినియోగించుకుని కుట్ర‌ల‌కు పూనుకున్నార‌ని ఆరోపిచారు. అదే కాకుండా లోకేశ్వ‌ర్ రెడ్డి త‌న ఫిర్యాదులో ఏయే సెక్ష‌న్‌లు పేర్కోన్నారో ఆ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేయ‌డ‌మ‌నేది వారి కుసంస్కారానికి అద్దం ప‌డుతుంద‌న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ అధికార యాప్ మిష‌న్ 100 ద్వారా తెలంగాణ ఓట‌ర్ల‌కు ఫోన్ చేసి వారి ఫీడ్ బ్యాక్ తీసుకుని మ‌రో ఓరుకు ఇలా ఫోన్ చేసి త‌మ పార్టీ చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు కావాలంటే టీఆర్ ఎస్ కే ఓటేయాల‌ని ప్ర‌ల‌కు ఫోన్ చేయ‌లేదా అని ప్ర‌శ్నించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ముంది ఇది మీరు చేస్తే చ‌ట్ట‌బ‌ద్దం అదే పక్క రాష్ట్రం చేస్తే నేరం ఎలా అవుతుంద‌ని అన్నారు. మా యాప్ లో వున్న మా కార్య‌క‌ర్త‌ల వివ‌రాల‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ కు అందిస్తున్నార‌ని ఆరోపించారు. ఎన్నిల ముందు ఇలాంటి కొత్త డ్రామాల‌కు తెర తీసి త‌ద్వారా ల‌బ్ది పొందాల‌ని కేసీఆర్ కుట్ర‌ల‌కు తెర లేపార‌న్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో అలాంటి కుట్ర‌లే చేశార‌ని అన్నారు. ఎన్నిక‌ల ముందు ఆంధ్రా, తెలంగాణ అనే సెంట్‌మెంట్ ను ప్ర‌జ‌ల్లో ర‌గిలించి ల‌బ్ది పొందార‌న్నారు. ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ తెలంగాణ బ‌ధ్ద శ‌తృవు అని ఆరోపించిన క‌ల్వ‌కుంట్ల క‌విత, కేటీఆర్‌లు ఇప్పుడు అదే జ‌గ‌న్ ఇంటికి వెళ్ళి క‌ల‌వ‌డ ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఇప్పుడు ఆంధ్రా తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకు రాదా అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వారు స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.
స‌మావేశంలో రేవూరి ప్ర‌కాశ్ రెడ్ది మాట్లాడుతూ..రాష్ట్రం విడిపోయినా రెండు తెలుగు రాష్ట్రాలు ఒక‌రినొక‌రు స‌హ‌క‌రించుకుంటూ దేశానికి ఆద‌ర్శంగా నిల‌వాల‌ని చంద్ర‌బాబు నాయుడు చూస్తుంటే … ఈ రెండు రాష్ట్రాల మ‌ద్య విధ్వేశాలు రెచ్చ‌గొట్టేంద‌కు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నీతిమంతుడే అయితే ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి సంబందించిన అంశం కాబ‌ట్టి ఆ రాష్ట్ర ప‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌నే ఇంగితగ్ఞానం ఉండాల‌న్నారు. జ‌య‌రా హ‌త్య కేసుకు సంబందించి వారు ఏపీకి చెందిన వారు అయినా ఆయ‌న శ‌వం ఏపీలో ల‌భ్యం అయినా దాని మూలాలు తెలంగాణ‌లో వున్నాయ‌ని, బాదితుల‌కు న్యాయం జ‌ర‌గాల‌ని ఏపీలో కేసు రిజిస్టర్ అయినా దానికి తెలంగాణ‌కు బ‌దిలీ చేసిన విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని సూచించారు. న‌యీం ఎన్‌కౌంట‌ర్ త‌రువాత టీఆర్ఎస్ మాజీ, తాజా ఎమ్మెల్యేల పేరు బ‌య‌టికి రావ‌డంతో ఆ కేసును నీరుగార్చార‌న్నారు. నిజామాబాద్ చాలానా కేసు, మియాపూర్ భూ కుంబ‌కోణం కేసులు ఏ మ‌య్యాయ‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను దోచుకుతింటున్న ఈ మాఫియా కేసుల‌ను ప‌రిష్క‌రించ‌కుండా ఏపీకి సంబందిచిన కేసుపే కేసీఆర్‌కు ఎంద‌కుకంత ప్రేమ అని ప్ర‌శ్నించారు.

Go To APTS Breaking News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *